నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని, లేదంటే మే 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్సుల్లో అమలు చేస్తున్నట్లే తమకూ పర్సంటేజీ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని […]
The post మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత appeared first on Navatelangana.













