ములుగు: మేడారంలో సిఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి అనసూయ సీతక్క దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ వనదేవతల గద్దెలతో పాటు  ఆలయ ప్రాంగణంలో పూల అలంకరణ, క్యూలైన్లు, భారీ కేడింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి ఆలయ ప్రాంగణం వరకు ఏర్పాట్లను క్షుణ్ణంగా సీతక్క పరిశీలించారు. వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజలు, తులాభారం ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ఏర్పాట్ల పరిశీలించారు. ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చలు జరిపారు. సిఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మేడారంలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధమైంది.