హైదరాబాద్: గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని, తన కుమార్తెతో కూడా క్షమాపణ చెప్పించాలని అన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ బిడ్డ మాట్లాడితే తమకు బాధ్యత ఉండదా? అని విజయరమణారావు ప్రశ్నించారు. క్షమాపణ చెప్పకుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారని, కొండా సురేఖ వివరణతో పార్టీ సంతృప్తి చెందకపోతే పదవి నుంచి తొలగిస్తారని, అసవరమైతే ఎలాంటి చర్య తీసుకోవడానికైనా పార్టీ వెనుకాడదని విజయరమణారావు హెచ్చరించారు.