చేబ్రోలు: గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాడైన ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమం సందర్భంగా బుధవారం భోజనాలు వడ్డించారు. ఆ రోజు మిగిలిన బిర్యానీని గురువారం కొందరు గ్రామస్థులు తిన్నారు. అదే రోజు రాత్రి నుంచి 50 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. వారిలో 44 మంది కోలుకోగా.. మరో ఆరుగురిని తెనాలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్‌పాయిజన్ సమాచారం అందుకున్న డిఎం‌హెచ్‌వొ విజయలక్ష్మి కొత్తరెడ్డి పాలెం గ్రామాన్ని సందర్శించి స్థానిక వైద్యారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.