సక్సెస్‌ఫుల్ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను ప్రకటించింది. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ప్ర ణయ్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నా రు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నంబర్ 15గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న 5వ చిత్రం కావడం విశేషం. బుధవారం హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ప్రకటించారు. సంగీత్ శోభన్‌ను ఇప్పటివరకు చూడని కొత్త తరహా పాత్రలో చూపించబోతున్న ఈ సినిమాకు ప్రణయ్ రావు ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ కూడా కీలకంగా ఉండనుంది.

యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా..

యంగ్ హీరో సంగీత్ శోభన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. శ్రావణి సమర్పణ లో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరో సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్ష లు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మే కర్స్. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా ఈ సినిమా తెరపైకి రాబోతోంది.