మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతుల సమస్యలు, పం టల కొనుగోలు, ఉద్యాన పథకాల నిధులపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సమగ్ర వినతిపత్రాలు సమర్పించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులు, రై తుల ఆర్థిక ఇబ్బందులు, మార్కెట్ పరిస్థితులపై చర్చించినట్లు తుమ్మల తెలిపారు. యాసంగి 2025-26లో 20.29 లక్షల ఎకరాల్లో సాగుతో 47.23 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొ న్న, జొన్న దిగుబడి అయ్యే అవకాశం ఉందని, భారీ దిగుబడులతో ధరలు క్వింటాల్‌కు రూ.1,800కి పడిపోయాయని మం త్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్‌పి రూ.2,400 ఉండగా రైతులు నష్టపోతున్నారని, 336 కేంద్రాల ద్వారా 11.45 లక్ష ల మెట్రిక్ టన్నులు కొన్నా సరిపోవడం లేదన్నారు. మొక్క జొ న్న, జొన్నను ప్రైస్ సపోర్ట్ స్కీం (పిఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకువచ్చి 14.90 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 2.01 లక్ష ల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోలుకు అనుమతించాలని కో రారు.

రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు పెరిగినా కేంద్రం కేవ లం 3,690 మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చిందని, ఎంఎస్‌పి రూ.7,721 ఉన్నా మార్కెట్‌లో తక్కువ ధర వస్తోందని, అ కాల వర్షాలతో పంట తడిసిపోతోందని వివరించారు. కొనుగో లు పరిమితిని 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని తు మ్మల విజ్ఞప్తి చేశారు. ఉద్యానవన పంటలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ వికాస్ యోజన(పిఎం ఆర్‌కెవివై) పెర్‌డ్రాప్ మోర్ క్రాప్(పిడిఎంసి)పథకంలో భాగంగా రూ.271.95 కోట్ల ప్రతిపాదనకు రూ.180.92 కోట్లు, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్  (ఎంఐడిహెచ్) కింద రూ.156.25 కోట్లకు రూ.85.50 కోట్లు మాత్రమే ఆమోదించారని, 2026-27కు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, 1.16 లక్షల హెక్టార్లలో 79,448 మంది రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గడంతో ధరలు పడిపోయాయని, సుంకాన్ని మళ్లీ 44 శాతానికి పెంచాలని, ఫ్రెష్ ఫ్రూట్ బంచ్(ఎఫ్‌ఎఫ్‌బి)కు మెట్రిక్ టన్నుకు రూ.25,000 కనీస ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


కూలీల కొరత, సాగు వ్యయం పెరగడంతో రైతులు హెర్బిసైడ్ టోలరెంట్ కాటన్(హెచ్‌టి) వైపు మొగ్గుచూపుతున్నారని, శాస్త్రీయ మార్గదర్శకాలు లేకుండా వినియోగం పెరగడం పర్యావరణం, విత్తన నాణ్యతపై ప్రభావం చూపుతోందని, జాతీయ స్థాయి స్పష్టమైన విధానం రూపొందించాలన్నారు. వినతి పత్రాలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారని, తుమ్మల తెలియజేశారు. రాష్ట్ర రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. గిట్టుబాటు ధరలు, ఉద్యాన అభివృద్ధి, పంటల కొనుగోళ్లలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని, త్వరలో సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని చెప్పినట్లు తుమ్మల పేర్కొన్నారు.