హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్డి సుమంత్‌పై కేసు నమోదైంది. సుమంత్ తనను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వనందుకు తనపై దాడి చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మొదట మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి జూబ్లీహిల్స్ పిఎస్‌కు బదిలీ చేశారు.