
వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’తో బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట ’బొమ్మ బొమ్మ’ను మేకర్స్ విడుదల చేశారు.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి మనసును హత్తుకునే మధురమైన మెలోడీని అందించారు. అనంత శ్రీరామ్ తన సాహిత్యంతో ప్రేమలో మునిగిపోయిన ఓ యువకుడి భావాలను కవితాత్మకంగా ఆవిష్కరిస్తూ, కథానాయిక అందం, ఆమె ప్రత్యేకతను ఎంతో అందంగా వర్ణించారు. ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ’శ్రీ శ్రీ’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.











