మన తెలంగాణ/మోత్కూర్: కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీక్ నిరుద్యోగం విద్యార్ధుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన లోక్ సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిఅరెస్టు చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు మండల మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తు వాటి ద్వారా ప్రతిపక్ష నాయకులను వేధించడం వారికి పరిపాటిగా మారిందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంత ల విమల వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ పేలంపూడి వెంకటేశ్వర్లు , మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ కార్యదర్శి మందుల సురేష్,మహిళ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు అన్నేపు పద్మ,ఎడ్ల శ్రీనివాస్, సుంకుశాల అనిల్,బద్దం నాగార్జున్ రెడ్డి,పల్లపు సమ్మయ్య చింతల విజయ భాస్కర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ పాలోజు శేఖర చారి, చిరుమర్తి యాదయ్య, రంగారెడ్డి, బందేలరవి, నకిరేకంటి రామనరసయ్య,అవిశెట్టి రాజాలు, బత్తినీ శేఖర్, మెంట యాదగిరి,పల్లె బిక్షం,తాటిపాముల మహేందర్,కురిమెటి సైదులు, కురిమెటి ఎల్లయ్య, రాచకొండ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.