
హైదరాబాద్: మే 10న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో భాగంగా రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు.
‘‘హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్‌ను మోడీ ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు. హఫీజ్‌పేట, జోగులాంబ రైల్వేస్టేషన్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడు రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని.. హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులున ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.










