
బిష్కెక్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ స్పష్టం చేశారు. ఇరాన్‌తో భారత్‌కు ఉ న్న చిరకాల స్నేహ సంబంధాలను మరింత బ లోపేతం చేయడంతో పాటు, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించి, మరి న్ని రంగాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపా రు. ఈ వివరాలను మోడీ సామాజిక మాధ్య మం ఎక్స్‌లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నె లకొన్న ప్రస్తుత పరిస్థితిపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపారు.
“సుస్థిరమైన శాంతి నెలకొనేందుకు ఉద్దేశించిన అన్ని ప్రయత్నాల కు భారత్ నిరంతరం మద్దతు ఇస్తుంది” అని మోదీ చెప్పారు. ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని, సమస్యలన్నింటినీ చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్ స్థిరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. నౌకాయానం, వాణిజ్య స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలు, వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలగకూడదని స్పష్టం చేశారు. బ్రిక్స్, ఎస్‌సిఓ సహా వివిధ వేదికల ద్వారా ఇరాన్‌కు భారత్ సహకరించేందుకు సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. రానున్న బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను భారత్‌కు స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
భారత్ మద్దతుకు పెజెష్కియాన్ కృతజ్ఞతలు..
ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఇరాన్‌కు భారత్ అందించిన మద్దతు, సహకారానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ కృతజ్ఞతలు తెలిపినట్లు ఇరాన్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రాంతంలో శాంతి, భద్రత నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ‘మా ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచీ శాంతి, భద్రతను నెలకొల్పడం, సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం’ అని పెజెష్కియాన్ పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాలను ఉపయోగించుకోవడానికి
బదులుగా అమెరికా యుద్ధం, అస్థిరత, బలప్రయోగం ద్వారా తన నిర్ణయాలను రుద్దే మార్గాన్ని ఎంచుకుందని ఆయన విమర్శించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న ప్రాధాన్యత, సామర్థ్యాలను ప్రస్తావించిన ఇరాన్ అధ్యక్షుడు.. ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను కూడా గుర్తుచేశారు. వివిధ దేశాలు, వర్గాలతో భారత్‌కు ఉన్న విస్తృత సంబంధాలను ఉపయోగించుకుని, యుద్ధం, రక్తపాతం నుంచి ఆయా పక్షాలు వెనక్కి వచ్చి చర్చలు, ఒప్పందాల మార్గంలోకి తిరిగి వచ్చేలా భారత్ తన వంతు కృషి చేయాలని పెజెష్కియాన్ మోదీని కోరారు.
ఆర్మేనియా ప్రధానితోనూ మోడీ భేటీ..
మోదీ సోమవారం ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్‌తోనూ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ‘బిష్కెక్‌లో ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది” అని మోదీ తెలిపారు. భారత్-ఆర్మేనియా సహకారం రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో మరింత విస్తరించనుందని మోదీ చెప్పారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కూడా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
పుతిన్‌తో మోడీ భేటీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి ముగింపు దిశగా సాగాలి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం యావత్ మానవాళి ఉమ్మడి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ సోమవారంనాడు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో మోడీ-పుతిన్ మధ్య ఈ కీలక భేటీ జరిగింది. మానవాళి సంక్షేమం కోసం యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమస్యలకు త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలన్నదే మానవాళి ఆకాంక్ష అని,
అదే భారతదేశ సందేశం అని మోడీ అన్నారు. భారత్ శాంతి మార్గాన్ని గుర్తుచేస్తూ, గాంధీ పుట్టిన నేల, బుద్ధిని నేల రెండు ఒకే సందేశాన్ని పంచుకుంటాయని, ఆ సందేశం శాంతిమార్గమని అన్నారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుదని మోడీ స్పష్టం చేశారు. యుద్ధమనేది మానవాళిని ప్రతిరోజూ వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశ, కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పుతిన్‌ను భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు కూడా హాజరుకావాలని మోడీ ఆహ్వానించారు. భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సదస్సుకు పుతిన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికేందుకు భారతీయులంతా ఎంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. గత ఏడాది పుతిన్ భారత్ పర్యటన తర్వాత మోదీ-పుతిన్‌లు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం ఇదే కావడం విశేషం.











