ఆగస్టు 19న చిన్నారి మర్మావయాలపై గాయాలు ఉండటాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలులో ఒక ‘బ్యాడ్ అంకుల్’ తనకు రోజూ చాక్లెట్లు ఇచ్చి తనను ఇబ్బంది పెడుతున్నట్టు తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో వారు బవానా పోలీస్ స్టేషన్, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 24న స్కూలులోని సీసీటీవీ వీడియో దృశ్యాలు, ఫోటోగ్రాఫ్‌లు చూపించడంతో ఆ నిందితుడిని చిన్నారి గుర్తించింది. అతనిని 8 నెలలుగా ఇదే పాఠశాలలో

బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న వికాస్‌గా గుర్తించారు. ఫిర్యాదు అందిన రోజునే నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు ఛాకెట్లు ఇస్తున్నట్టు అతని ఫోన్‌లో ఉన్న వీడియాల్లో గుర్తించామని, పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ‘సిట్’ను ఏర్పాటు చేశారు.