
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు నిలిచిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ గొంతును అణచివేసే ప్రయత్నం జరిగిందని, ఇది పిరికిపంద చర్యగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఉదయం 6.16 గంటలకు ఖాతా తొలగించారని ఆయన పోస్టు చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో 6.45 గంటలకు ఖాతాను పునరుద్ధరించినట్టు మరో పోస్టులో తెలిపారు. ఇలాంటి చర్యలకు తాము భయపడమని దీప్కే పేర్కొన్నారు. తమను అడ్డుకోవాలనుకునే వారు స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంచుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి కారణంతో కేంద్రం ఈ ఖాతాను గించడానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇంతకు ముందు కూడా సీజేపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష సందర్భంగా సీజేపీ ఖాతా ద్వారా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో కేంద్రం ఈ ఖాతాను బ్లాక్ చేసింది. అనంతరం గత జులైలో కోర్టు ఖాతాను పునరుద్ధరించాలని ఆదేశించడంతో ఈ అకౌంట్ తిరిగి ప్రారంభమైంది.
“ స్కూల్ ఠీక్ కరో” ప్రారంభం
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ పార్టీ అధికారంలో ఉన్నా మారడం లేదని దీప్కే అన్నారు. మహారాష్ట్ర లోని హింగోలి జిల్లా లోని తన సొంత గ్రామమైన సంతుక్ పింప్రీ నుంచి “ స్కూల్ ఠీక్ కరో ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు, గ్రామస్థులు, సర్పంచులు సామాజిక తనిఖీలు చేసి నిలదీయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. భారీ ప్రచారాలకు ఖర్చు చేసే డబ్బును గ్రామీణ పాఠశాలలు, విద్యార్థుల కోసం వెచ్చిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం కోసం తాము బృందాలను ఏర్పాటు చేశామని, వారు గ్రామాలను సందర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా గ్రామీణ విద్యార్థులు పాఠశాలల్లో కనీస సౌకర్యాల కోసం ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదని దీప్కే పేర్కొన్నారు.











