
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. భబానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,105 ఓట్ల తేడాతో మమత ఓడిపోయారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, మమతకు 58,812 ఓట్లు లభించగా, సువేందు 73,917 ఓట్లను సాధించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు శ్రీజీబ్ బిస్వాస్ 3,556 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. దీంతో టిఎంసికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరనుంది.
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసి పార్టీని చిత్తుగా ఓడిస్తూ బిజెపి ఘన విజయం సాధించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి 208 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, టిఎంసి కేవలం 79 స్థానాల్లో ముందంజలో ఉంది.












