
ఢిల్లీ: మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తెలిపింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుందని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ జరుగుతుందని వివరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్ ను తిరస్కరించింది.











