
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్ర జలకు ప్రభుత్వం తీపికబురు అందించిం ది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆ హార భద్రతను మరింత బలోపేతం చే యాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సం క్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనుంది. ముందుగా సంగారెడ్డిలో సిఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ ప్రారంభం కానుండగా అదే రోజు 119 నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డుల పంపి ణీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మం జూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) రేషన్ కార్డులను ఆగష్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం నుంచి పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. కొత్తగా అర్హ త పొందిన ప్రతి కుటుంబాని కి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చే రేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అ మలు చే యాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డి విజనల్ అధికారి (ఆర్డీ ఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్య్ర ది నోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగష్టు 15వ తేదీన మధ్యాహ్నం 2 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వర కు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను పౌరసరఫరాల శాఖ -ఆదేశించింది. పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పౌరసరఫరాల శాఖ -పేర్కొంది. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని పౌరసరఫరాల శాఖ -తెలిపింది. ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తం గా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెమో జారీ చేశారు.











