
ఐపిఎల్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) 103 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 54 బంతుల్లోనే 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. దీంతో సిఎస్కె భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీసి సిఎస్కెను గెలిపించాడు.
