
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ముంబై ఇచ్చిన 244 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి.. ఆరు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలిచింది. ఇది సన్‌రైజర్స్‌కి వరుసగా ఐదో విజయం కావడం విశేషం.
కాగా, ఈ విజయంతో సన్‌రైజర్స్ ఐపిఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు 100వ విజయం. 2013లో ఐపిఎల్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ ఇప్పటికవరనూ 205 మ్యాచ్‌లు ఆడింది. అందులో 100 మ్యాచుల్లో గెలవగా.. 104 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక ఇప్పటివరకూ సన్‌రైజర్స్ రెండు సార్లు (2016, 2024) ఫైనల్స్‌కు చేరింది. 2016లో విజేతగా నిలిచింది. 2024లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతేకాక.. నాలుగుసార్లు ప్లేఆఫ్‌కి కూడా చేసింది. దీంతో నిలకడైన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు తెచ్చుకుంది.











