
తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి వృద్ధుడు కొట్టుకుపోయిన సంఘటనా మియాపూర్ లో చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తి హఫీజ్ పేటకు చెందిన బాలయ్యగా గుర్తించారు. ఈ ఘటన వైశాలి నగర్ అండర్ పాస్ వద్ద జరిగింది. మిస్సయిన వ్యక్తి కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. వైశాలినగర్ అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతులు జరుగుతున్నాయి.మరమ్మతులు చేసేందుకు కొన్నిరోజులుగా అండర్ పాస్ ను అధికారులు మూసి వేశారు. ఈ ప్రమాదానికి జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగినప్పటికి జిహెచ్ఎంసిలో మాత్రం మార్పు రావడంలేదనే విమర్శలు వస్తున్నాయి.











