అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ’లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి సోమవారం నాడు బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌ను జరుపుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీంకి షీలడ్స్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో.. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ‘ఈ సినిమా లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అందరూ ప్రేమించి ఈ మూవీని చేశారు.

ఆ ప్రేమను ఆడియెన్స్, అభిమానులంతా తిరిగి చూపించారు.నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. ‘లెనిన్’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్‌” అని అన్నారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. “మా ‘లెనిన్’ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున, నాగవంశీ, అఖిల్ కి థాంక్స్ ‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో నాగచైతన్య, సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.