
ష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ ఏడాది నాలుగు నెలల్లో 260 మంది మావోయిస్టులు 238 ఆయుధాలతో లొంగిపోయారని డిజిపి వెల్లడించారు. ఈ క్రమంలో 2024 నుంచి ఇప్పటి వరకు వివిధ క్యాడర్లకు చెందిన 818 మంది మావోయిస్టులు, 334 ఆయుధాలతో లొంగిపోయారని రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద లొంగుబాటు శకంగా డిజిపి చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన డికెఎస్‌జడ్‌సి సభ్యుడు హేమ్లా ఐతు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడిగా కీలక నేతగా ఉన్నారని, పొడియం లచ్చు అలియస్ మనోజ్ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో 9వ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, సుమారు 17 సంవత్సరాలుగా అజ్ఞీత జీవితం గడుపుతున్నట్లు డిజిపి వివరించారు.












