
మన తెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో రాష్ట్రంలో 2కోట్ల 81లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని, కొత్తగా కుటుంబీకుల పేర్లను కూడా నమోదు చేశామని 62లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూరనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ఈ రోజుకు మొత్తం 3కోట్ల 42లక్షల మంది రేషన్ లబ్ధిదారులున్నారని వారికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు.










