ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ చేయడం మనేది ఘోరమైన పాపమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తొలి సారి నీట్ పేపర్ లీకేజీపై మోడీ ప్రసంగించారు. ఇలాంటి లీక్‌లు నివారించడం అనేది జాతీయ బాధ్యత అని తెలియజేశారు. మంగళ్ మిలన్ పేరిట మంగళవారం ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పిఎం మోడీ మాట్లాడారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చని, దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా అందరూ సహకరించాలని నరేంద్ర మోడీ కోరారు. పిల్లలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం చాలా సులభం అని పేర్కొన్నారు. తిరిగి సరైన మార్గంలో రావడంతో చాలా కష్టంగా ఉంటుందని మోడీ వివరించారు .