
డిల్లీ: నీట్ లీక్ పై ఆందోళన చేసిన విద్యార్థులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్ వద్ద పోలీసులు లాఠీచార్జిపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేరచరిత్ర లేని అరెస్టైన విద్యార్థులను, నిరసనకారులను అన్ని రాష్ట్రాల్లో వదిలి వదిలి పెట్టాలని, కేంద్రం సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపహిరించుకోవాలని సూచించింది. ఘటనలపై సిసి ఫుటేజ్ ను కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.











