నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణలో మరో ముందడుగు పడింది. మంగళవారంనాడు ఇక్కడి స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. బుధవారంనాడు విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. సిబిఐ ఇప్పటికే 13 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంది. నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాస ఉల్లంఘన, సాక్ష్యాధారాల ధ్వంసం, అవినీతి, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలు తదితర నేరాలను సిబిఐ మోపింది. 422 పేజీల చార్జిషీట్‌లో 360 మంది సాక్ష్యాలను పొందుపరిచింది.