మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా నీటి సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే వర్షాలు పడలేదనే కారణాన్ని చూపుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా వచ్చే సంవత్సరం వరకు మన రిజర్వాయర్లలోని నీటితో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వొచ్చని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. కానీ వర్షాలు పడలేదు, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, వ్యవసాయ మంత్రి తుమ్మల అంటున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. వీళ్లకు అవగాహన ఉండి మాట్లాడుతారో, లేక అవగాహన లేక మాట్లాడుతారో అర్థం కాదలేదని, మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా ఇచ్చేందుకు చేతకాక, అవగాహన లేక వర్షాలు పడలేదని ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు.