
హైదరాబాద్: తాను స్పీకర్‌ను దూషించలేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి తాతా మధు తెలిపారు. పోలీసులు తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, తనపై దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. స్పీకర్, మండలి ఛైర్మన్‌పై అపార గౌరవం ఉందని, కాంగ్రెస్ నేతలు ఏ డిమాండ్ చేసినా తాను భయపడనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే దారుణంగా తాను మాట్లాడలేదని తెలియజేశారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డిని ఎస్‌సి ఎంఎల్‌ఎలు కలిశారు. స్పీకర్‌పై ఎంఎల్‌సి తాతా మధు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్‌సి ఎంఎల్‌ఎలు సిఎంను కోరారు.








