
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. వచ్చే వారం నుంచే వరుసగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. కమిషన్ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్ర సంగించారు. వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఉద్యోగార్థుల భవిష్యత్తును దృ ష్టిలో ఉంచుకుని నియామక ప్రక్రియలోని ప్రతి ద శలోనూ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా,
బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఛైర్మన్ సూచించా రు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక డిజిటల్ సాంకేతికతలను పరీక్షలు, ఫలితాల ప్రక్రియలో వినియోగించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత నమ్మకాన్ని నిలబెడుతూ ఉద్యోగాల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డాక్టర్ అమీర్‌ఉల్లాఖాన్, రజనీ కుమారి, సి.చంద్రకాంత్ రెడ్డి, ప్రొ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, కార్యదర్శి ఎం.హరితలతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











