తాజా కితాబ్

అదృశ్య రాజ్య చరిత్ర:  మానవ సమాజ పరిణామ క్రమంలో రా జ్య అవసరం ఎందుకు కల్గింది అనే చిక్కు ప్రశ్నకు భిన్నమైన వివరణలు, విశ్లేషణ లు సైద్ధాంతికపర చర్చలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. గత ఎనిమిది దశాబ్దాలలో రాజ్యాంగంలో ఏమి రాసిసున్నా బలప్రయోగం పెరుగుతూ వస్తున్నది.రాజ్యం హింసను నియంత్రించాలని భావించినా రాజ్యమే హింసను ప్రేరేపించడం, ద్వేషాల్ని రెచ్చగొట్టడం, మత విశ్వాసాలని విద్వేషాలుగా మార్చడం, ప్రజా పోరాటాలని నగ్నంగా అణచివేయడం, తానే ఒక నేరమయ వ్యవస్థగా రూపాంతరం చెందడం ఒక చారిత్రక విషాదం. ప్రఖ్యాత జర్నలిస్టు జోసీ జోసెఫ్ సమకాలీన రాజ్య వ్యవస్థ అంతర్గత విధ్వంసాన్ని వివరిస్తూ రాజ్యమే నేరమయం కావడం లాంటి కొన్ని భయంకరమైన వాస్తవాలను, సంఘటనలు సోదాహరణంగా,సాక్ష్యాధారాలతో మన ముందుంచాడు. రాజ్య నిజ స్వరూపాన్ని ప్రతిభావంతంగా వివరించాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత మనం మనంగానిలిబెట్టు కోవడానికి, తీవ్రమైన షాక్ (Shock) నుండి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. జోసీ జోసెఫ్ చేసిన ఈ సాహస రచనకు చరిత్ర రుణపడి ఉంటుంది.

ప్రొ.జి.హరగోపాల్

ఒక గాంధేయ విశ్లేషణ: ప్రజాస్వామ్యం, రాజ్యాధికారం,అణగారిన వర్గాలను ఒక మూలకు విసిరేసిన పరిస్థితి: జోసీ జోసెఫ్ రాసిన ‘నిశ్శబ్ద కుట్ర’ పుస్తకం. భారత ప్రజాస్వామ్యపు సమకాలీన చర్చల్లోకి జోసీ జోసెఫ్ రాసిన ‘నిశ్శబ్ద కుట్ర’ పుస్తకం గణనీయంగా జోక్యం చేసుకొన్నది. భారత ప్రజాస్వామ్యనికున్న బలప్రయో గ, విచారణ సంస్థల పనివిధానంలో ఈ జోక్యం ప్రముఖంగా కనిపించింది. భారతదేశం నిశ్శబ్ద కుట్రకు బలవుతుందని జోసెఫ్ ముందుకు తెచ్చిన కీలక భావన-ప్రభుత్వసంస్థల్లో పైకి మాత్రం ప్రజాస్వామ్య పాలనారూపాన్ని కొనసాగిస్తూ, లోపల రాజ్యాంగపు వాగ్దానాలను ఉపేక్షిస్తూ -మెల్లిమెల్లిగా, ఒక పద్దతి ప్రకారం జరుగుతున్న మార్పులను ఎత్తి చూపుతుంది. ఈ మార్పులు ఒకసారిగా వచ్చినవి కాదు. సంచలనాత్మకం అంతకంటే కాదు. ఇవి క్రమంగా పెరుగుతూ, సాధారణీకరణ చెందుతూ -దైనందిన పరిపాలన, న్యాయ ప్రక్రియల్లో అంతర్భాగంగా మారుతున్నాయి. ఆదివాసీ సమూహాలతో లోతైన అనుబంధ దృక్కోణం నుంచి ఈ పుస్తకం ఒక స్పష్టమైన గాఢమైన అనుభవాధారిత పరిమాణాన్ని సంతరించుకొన్నది. సైనికీకరణ, వనరుల దోపిడీ ఆర్థిక విధానాలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని తడమటం వలన -ఈ ప్రత్యేకత ఈ పుస్తకానికి వచ్చింది.

- హిమాన్షు కుమార్

నిశ్శబ్ద కుట్ర

రచయిత : జోసీ జోసెఫ్

అనువాదం : విమల్

ధర : రూ.270/-

కాపీ కోసం మలుపు బుక్స్ 6305991831