
మనతెలంగాణ / సిటిబ్యూరోః నల్గొండ ఎక్స్ రోడ్డు నుండి ఒవైసీ జంక్షన్ కారిడార్ వరకు సమగ్ర అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. సైదాబాద్ జంక్షన్ నుండి యాదగిరి థియేటర్ వరకు కుడి వైపున ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేస్తున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరిగే కాలంలో సైదాబాద్ వై జంక్షన్ నుండి యాదగిరి థియేటర్ వరకు ఒకవైపు రహదారిని పూర్తిగా మూసివేస్తారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుండి ఒవైసీ ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డు నుంచి ప్రయాణించవద్దు.
నల్గొండ ఎక్స్ రోడ్ నుండి చంద్రాయణగుట్ట వైపు వెళ్లే వాహనాలు సైదాబాద్ వై జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
సైదాబాద్ వై జంక్షన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని డిసిపి ఈస్ట్ జోన్ ఆఫీస్, సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ , సరస్వతి నగర్ కమాన్, శంకేశ్వర్ బజార్, ఇండియన్ పెట్రోల్ బంక్ (కుడి మలుపు), సింగరేణి కాలనీ, ఓనస్ రోబోటిక్ ఆస్పత్రి, చంపాపేట్ మెయిన్ రోడ్ , లక్ష్మారెడ్డి గార్డెన్ వైపు ఎడమ మలుపు తిరగాలి, లక్ష్మారెడ్డి గార్డెన్ వద్ద కుడి మలుపు తీసుకుని, డీఎంఆర్‌ఎల్ రోటరీ వద్ద కుడి మలుపు తీసుకుని వెళ్లాలి.
చంద్రాయణగుట్ట నుండి నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్లే వాహనాలు డీఎంఆర్‌ఎల్ వద్ద కుడి మలుపు తీసుకుని, లక్ష్మారెడ్డి గార్డెన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని చంపాపేట్ వైపు వెళ్లాలి.
చంపాపేట్ నుండి ఐఎస్ సదన్ వైపు ఎడమ వైపు తీసుకుని, సింగరేణి వైపు కుడి మలుపు, శంకేశ్వర్ బజార్, 105 బస్ స్టాప్, సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ , సైదాబాద్ వై జంక్షన్, చంచల్‌గూడ, మలక్‌పేట్ ఫైర్ స్టేషన్ మీదుగా వెళ్లాలి.
చంచల్‌గూడ నుండి సైదాబాద్ వై జంక్షన్ వైపు వచ్చే వాహనాలు ఎడమ వైపు రోడ్డు గుండా వెళ్లాలనుకునే ద్విచక్ర , త్రిచక్ర వాహనాల కోసం రోడ్డును ఇరువైపులుగా విభజించారు. కుడి వైపు రోడ్డును తాత్కాలికంగా మూసివేయనున్నారు.
సైదాబాద్ వై జంక్షన్ నుండి డీఎంఆర్‌ఎల్ వైపు వెళ్లే బైక్‌లు, ఆటోలు కేటాయించిన లేన్‌లో వెళ్లాలి.
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), చాదర్‌ఘాట్ నుండి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే, వచ్చే అన్ని జిల్లాల ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు. నల్గొండ ఎక్స్ రోడ్ నుండి మలక్‌పేట్ గంజ్ , మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్ , ఎల్బీనగర్ చౌరస్తా మీదుగా వెళ్లాలి .
బైక్‌లు, ఆటోలు, స్థానిక కాలనీల వాహనాలు యాదగిరి థియేటర్ రోడ్ మీదుగా ప్రయాణించి, ఇంటర్నల్ రోడల ద్వారా వెళ్లాలి.











