
సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం పక్కా ఫ్యామిలీమ్యాన్‌లా మారిపోతుంటారు. ముఖ్యంగా తన పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన ముద్దుల కుమార్తె సితార పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ స్పెషల్ పిక్‌లో మహేష్ బాబు తన కుమార్తె సితారను ఎంతో ప్రేమగా ముద్దాడుతూ కనిపించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “నువ్వు ఎంత ఎదిగినా ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే.. హ్యాపీ 14 సితార!
ఈ ఏడాది నీకు ఎంతో అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను.నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను”అని మహేష్ బాబు పేర్కొన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఈ అందమైన బంధాన్ని చూసి ఘట్టమనేని అభిమానులు ఫిదా అవుతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటోకు వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. సితారకు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సితారకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. “మా జీవితాల్లో ఎంతో ఆనందం, ప్రేమను నింపిన నా అందాల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ఎదుగుదలను చూస్తుండటం నాకు దక్కిన అతి పెద్ద వరం. హ్యాపీ బర్త్‌డే... ప్రేమతో...”అని ఆమె తెలిపారు.











