
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి గుండెకాయ లాంటి టైమ్‌స్వేర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 53 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత న్యూయార్క్‌కు చెందిన నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు ఛాంపియన్‌గా అవతరించడంతో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మంగళవారంనాడు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు దుండగులు వేడుకల వద్దకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు సాయుధుల నుంచి తుపాకులు లాక్కుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.











