
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ “ఇది ప్రేమతో, కష్టపడి చేసిన సినిమా. ఐశ్వర్యకి నేను అభిమానిని. ఆమెతో రెండోసారి కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది”అని అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ’సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ’ఓ.! సుకుమారి’ తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దర్శకుడు భరత్ దర్శన్ మాట్లాడుతూ “ఈ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరిస్తుంది. వినోదానికి ఎలాంటి లోటు ఉండదు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేశ్వర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కుషేందర్, భరత్, శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.









