
కర్నూలు: ఆస్పర్జిల్లోసిస్ అనే ఫంగస్ రియల్ గా అయితే ఇలా ఉంటుంది.. ఎక్స్ రేలో కనపడిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ ఫంగస్ లాగే ప్రమాదకరమైనది. ఇది నిదానం గా పెరిగి ఆ ఊపిరితిత్తులు లో క్యావిటీనంత ఆక్రమించుకొని దగ్గు కలుగజేసి రక్తం హీమాప్టైసిస్ ద్వారా ప్రాణాలను తీస్తుంది. ఈరోజు 70 ఏళ్ల పేషెంట్ కు ఆపరేషన్ చేశాము. ఈ సర్జరీకి 5 గంటల సమయం పట్టింది. అతి క్లిష్టమైన ఊపిరితిత్తులు ఆపరేషన్ కుడివైపు అప్పర్ లోబెక్టమి చేశాము. పేషెంట్ బాగున్నాడు కాకపోతే మాకే నడుములు మెడ నొప్పులు వచ్చాయి. పేషెంట్ బాగయితే అంతా మరిచిపోతాము.
ఇటువంటి ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులలో రెండు వందలకు పైగా చేసి ఉంటాను. మూడు నుంచి ఐదు లక్షల పైన ఖరీదైన ఈ ఆపరేషన్ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్ టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా చేయబడుతుంది. దీనికి ప్యాకేజీ చాలా తక్కువగా ఉండడం వలన బయట ఆసుపత్రులలో చేయరు. ఇంకో సంవత్సరం మాత్రమే నాకు సర్వీస్ ఉంది. తర్వాత రిటైర్ అయిపోతాను కావున ఎవరైనా అవసరం ఉంటే తొందరగా చూపించుకోగలరు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు














