రాష్ట్రంలో అక్టోబర్‌లో నిర్వహించనున్న ఒపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) విడుదల చేసింది. దూర విద్యావిధానంలో ఎస్‌ఎస్‌ఎస్, ఇంటర్మీడియట్ చదువుతున్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 17 వరకు ఫీజు చెల్లించవచ్చని టాస్ డైరెక్టర్ కె.లింగయ్య తెలిపారు. ఆ తర్వాత ప్రతి పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో ఆగస్టు 24 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో ఆగస్టు 29 వరకు పరీక్షలు ఫీజు చెల్లించవచ్చని అన్నారు.

అలాగే తత్కాల్ కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు ద్వారా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు టాస్ అధికారిక వెబ్‌సైట్, టిజిఆన్‌లైన్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని అన్నారు. అక్టోబర్‌లో జరగనున్న ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.త్వరలో పరీక్షల టైం టేబుల్ విడుదల చేస్తామని తెలిపారు.