2022లో విడుదలైన ‘గట్టా కుస్తీ’ (తెలుగులో మట్టి కస్తీ) భారీ విజయాన్ని అందుకుంది. ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్, కామెడీ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ రిలీజ్ అయింది. తొలి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి రెండో భాగం ప్రారంభం అవుతుంది. అయితే ఈ నెల 3వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జులై 31వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. చెల్ల అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగి బాబు తదితరులు నటించారు. మరి ఈ సినిమా బుల్లితెరపై ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి.