ఢిల్లీ: అనేక లీకేజీ కేసుల్లో నిందితులను ఈ ప్రభుత్వం బెయిలిచ్చిందని పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. నీట్ పేపర్ లీకేజీ విషయంపై లోక్ సభలో ఆయన మాట్లాడారు. 2024 నీట్ లీకేజీ నిందితుల్లో 44 మందికి బెయిల్ ఇచ్చారని, నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించలేదని, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేశామని ప్రధాని ఇన్ స్టా రీల్ ద్వారా చెప్పారని విమర్శించారు. రెండేళ్ల క్రితం కూడా నిపుణుల కమిటీ వేశారు కదా! దానిపై ఏం చేశారు? అని గౌరవ్ గంగోయ్ ప్రశ్నించారు. పదేపదే లీకేజీలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోయిందని, పదే పదే లీకేజీలు జరుగుతున్నా ఎన్డిఎ ఛైర్మన్ ను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. ఎన్డిఎ ఛైర్మన్ గతంలో మధ్యప్రదేశ్ పిఎస్సి ఛైర్మన్ గా కూడా ఉన్నారని, ఎన్డిఎ ఛైర్మన్ గా ఉన్నప్పుడూ ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారినే ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో నియమిస్తున్నారని, లీకేజీలకు బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ ను లోక్ సభకు ఆహ్వానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ల మేరకే ఈ బిల్లులో శిక్షలు పెంచారని గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు.