
నీట్ లీక్ వివాదంలో ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన ప్రధానమంత్రి పదవిని కాపాడుకున్నారని ఎస్‌పి నేత, ఎంపి అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆక్షేపించారు. యువత ఆందోళలను తాము ప్రశంసిసున్నామని అన్నారు. విద్యార్థుల నిరసనను అణిచివేయడానికి లాఠీచార్జీ, పెల్లెట్‌గన్స్, విద్యుత్ బ్యాటన్లను కూడా ప్రయోగించారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల మనోగతాన్ని ఈ ప్రభుత్వం వింటుందని ఆశిస్తున్నామన్నారు. అయోధ్య విరాళాలు కూడా దోపిడీ చేసిన వాళ్లు పేపర్ లీక్‌లు ఆపగలరా అని ప్రశ్నించారు. ఆందోళనకారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం నిరసనకారులకు మోకరిల్లిందని, అందువల్లే డిమాండ్లకు అంగీకరించిందని ప్రధాన్ రాజీనామా ఉదంతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.











