మన తెలంగాణ/హైదరాబాద్: యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క, అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి సీతక్క ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సీతక్కతోపాటు కెటిఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.