బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చా రిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాప న్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక ని ర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ ‘సర్దార్ స ర్వాయి పాపన్న‘. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పలువు రు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘ నంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా. ప్రతాని రామకృ ష్ణ గౌడ్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలు గు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మా ఆ ర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. పన్నుల దోపిడీ నుం చి పేద ప్రజలను కాపాడిన సర్దార్ పాపన్న బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాటం సాగించాడు”అని అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడు తూ “పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. బాహుబలి లాగా భారీ సినిమాటిక్ అనుభూతినిస్తుందని నమ్ముతున్నాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కి, స్వామి గౌడ్, పాయల్ ముఖర్జీ, ఏపూరి సోమన్న, పొన్న రవిచంద్ర. కొండ దేవన్న, అశోక్ గౌడ్, రాజ న్న, రామచంద్రరావు, సత్యనారాయణ, దీపక్ న్యాతి పాల్గొన్నారు.