
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కాన్వాయ్‌లో సగం వాహనాలను తొలగించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనం ఆదా చేయాలని మోడీ ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ పనిని తనతోనే మొదలు పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట.
ఈ నేపథ్యంలోనే తన కాన్వాయ్‌ని సగానికి కుదించాలనే ఆలోచన చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాక.. కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(EV) వినియోగాన్ని పెంచాలని మోదీ ఆదేశించారట. కానీ, అందుకోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. భద్రతా ప్రోటోకాల్స్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూనే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) ఈ ఆదేశాలను అమలు చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.












