
ట్రైనీ ఐపిఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపిఎస్ ఉయయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ కేసు ఐవోగా చార్మినార్ మహిళా పోలిస్టేషన్ సిఐ జ్యోత్స్న, కేసు పర్యవేక్షణ అధికారిగా మహిళా భద్రత విభాగం డిసిపి లావణ్యను నియమించారు. మరోవైపు తనపై అత్తాపూర్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి జూన్ 21న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. గతంలో వాదనలు విన్న హైకోర్టు అదనపు పిపి జితేందర్ రావు వివరాలు సమర్పించడానికి సమయం కోరడంతో తదుపరి విచారణ మరో సారి బుధవారానికి వాయిదా వేసింది. సహచర ట్రైనీని లైంగికంగా వేధించారని మహిళా ట్రైనీ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసుస్టేషఫన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత ఆస్పత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డి చేరారు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కనిపించకుండాపోయాడు. ఫోన్ స్విచాఫ్ చేసుకుని కనిపించకుండా పోయిన ఉదయ్‌ని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డినీ చట్ట పరిధిలో ప్రొసీజర్ ప్రకారం
విచారిస్తామని రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేసులో నమోదైన సెక్షన్లు, ఆధారాలు బేస్ చేసుకొని అతడిని విచారిస్తామని తెలిపారు. అరెస్టు చేయాలా? లేక నోటీసులు ఇచ్చి విచారించాలా? అనేది అతడిపై నమోదైన సెక్షన్స్‌పై ఆధార పడి ఉంటుందని వెల్లడించారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై కొన్ని అభియాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని తర్వాత వెల్లడిసా ్తమన్నారు. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు. అయితే తాను కనిపించడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంగళవారం ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమేనని కొట్టిపారే శారు. తన నానమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తన స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చినట్లు వెల్లడించారు. తనకు న్యాయ, పోలీస్ వ్యవస్థలపై నమ్మకం ఉందన్నారు. అయితే తనది పూర్తిగా గ్రామీణ నేపథ్యం అని గుర్తు చేశారు. తన శాశ్వత చిరునామా ఊళ్ల పాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.











