
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్వార్ సర్కిల్ బైరాగఢ్ పరిధిలోని చలుంజ్ మోర్ గ్రామ శివారులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.








