
హైదరాబాద్: టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన పూజా హెగ్డే నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. రాధేశ్యామ్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జోడి కట్టారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే ఇంటర్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాధేశ్యామ్ షూటింగ్‌లో తీపి గుర్తులను గుర్తు చేశారు. ప్రభాష్ ప్రతి రోజూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించేవాడని ప్రశంసించారు. అతడు ఇచ్చిన క్యారేజ్ డబ్బాలనె ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ప్రభాస్ దగ్గర నుంచి ఎదైనా దొంగలిస్తారా? అని యాంకర్ అడగడంతో వెంటనే ఆమె జవాభిచ్చారు. ప్రభాస్ ఇంటి నుంచి వంటవాడిని దొంగలిస్తానని నవ్వుతూ చెప్పారు. ప్రభాస్ దగ్గర నుంచి అదొక్కటేనని, ఇంకేమీ లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శ్రీశ్రీ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె నటిస్తున్నారు. జననాయగన్ సినిమా షూటింగ్‌లో పూజా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.













