హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. యాదాద్రి జిల్లాలో హన్మాపూర్ లో టిబిజెపి చీఫ్ రాంచందర్ రావు ధాన్యం సేకరణ కేంద్రం పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ వైఖరి రైతాంగానికి వ్యతిరేకంగా ఉందని, మిల్లర్లు, దళారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల సమస్యలు ఎదురౌతున్నాయని మండిపడ్డారు. రైతులతో రాజకీయమా? అని ప్రశ్నించారు. మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని రాంచందర్ రావు కోరారు.