
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ పిసిసి చీఫ్ మహేందర్ కుమార్ గౌడ్ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2కు వెంటనే కేంద్ర ఆమోదం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.38,595 కోట్ల మెట్రో విస్తరణ ప్రాజెక్టును జాయింట్ వెంచర్లో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సహాయం ఇవ్వాలని, మూసీ ప్రాజెక్టును జాతీయ స్థాయి అర్బన్ రివర్ రీస్టోరేషన్ ప్రాజెక్టుగా గుర్తించాలన్నారు. బాపూ ఘాట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ అప్రూ వల్ వెంటనే ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి కూడా కేంద్ర అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును 100 శాతం కేంద్ర నిధులతో చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి చొరవ చూపాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపా లని విజ్ఞప్తి చేశారు. రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్ల సహాయం, హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరా రు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్ర సహకారం కోరారు. హైదరాబాద్ ఫ్యాబ్ సిటీకి సెమీకండక్టర్ మిషన్ కింద ప్రాధాన్య ం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర పరిశీలనలో ఉన్న సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు తుది ఆమోదం ఇవ్వాలని కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేట్లు చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ విభజన హామీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయి యూనిట్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయా లు, నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని కోరా రు. తెలంగాణకు నిధులు, అనుమతులు ఇస్తేనే మోడీకి రాష్ట్రంపై ప్రేమ ఉందని భావిస్తా మన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బిజెపిని ద్రోహులు గా చూస్తారని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుపై గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. తేజస్వీ సూర్యా తెలంగా ణను పాకిస్తాన్‌తో పోల్చారని విమర్శపై పిసిసి నిరసన తెలిపిందని గుర్తు చేశారు. తెలంగాణపై బిజెపి నేతలు విషం చిమ్మడం ఆపాలని విజ్ఞప్తి చేశా రు. తెలంగాణ పట్ల బిజెపి నేతలు ద్వేషాన్ని వీడాలని, రాష్ట్ర అమరవీరుల త్యాగా లను గౌరవిస్తూ కేంద్ర నిధులు, ప్రాజెక్టులు తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ తన లేఖలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు















