హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమా. ఈ సినిమా 3 రోజుల్లోనే 40.1 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య మాట్లాడుతూ “ఈ చెన్నై లవ్ స్టోరీతో మరో కల్ట్ లవ్ స్టోరీని ఇండస్ట్రీకి ఇచ్చారు. ఈ సినిమాలో నేను కోరుకునే ప్రేమ కథను చూశాను.

ఈ సినిమా చూశాక ఎంతో సంతోషించాను. పరిణతితో రాసిన ప్రేమ కథ ఇది. ఇంత మంచి కథ రాసి మరో దర్శకుడికి ఇవ్వడంలోనే సాయి రాజేష్ గొప్పదనం కనిపిస్తోంది”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “స్టీవెన్ శంకర్ లాంటి మరచిపోలేని పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ రవికి థ్యాంక్స్. ఇది నేను చేస్తే బాగుంటుంది అని నమ్మిన సాయి రాజేష్‌కు థ్యాంక్స్. అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లి మా సినిమా చూస్తున్నారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ యెర్నేని, శ్రీ గౌరి ప్రియ, రవి నంబూరి, సాయి రాజేష్, ఎస్ కేఎన్, ధీరజ్ మొగిలినేని, శశి, శైలేష్ కొలను, కరుణ కుమార్, దేవిప్రసాద్, అనంత శ్రీరామ్, త్రిగుణ్, యతి పాల్గొన్నారు.