
లక్నో: అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓ వివాహిత తన ప్రియుడితో మాట్లాడుతుండగా మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండడంతో అతడి గొంతు నులిమి చంపేసింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మథుర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రుచి జిందాల్(32) అనే మహిళ తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి బల్‌దేవ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త మెడికల్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నెల రోజుల క్రితం అకస్మాత్తుగా కుమారుడు చనిపోవడంతో దహనసంస్కారాలు నిర్వహించారు. కుమారుడిని ఏడుస్తుండగా గొంతు నులిమి చంపిన విషయం ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త చాటుగా విన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి రుచి జిందాల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.











