బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ముంబయ్‌లో జరిగిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్క్రీనింగ్ సందర్భంగా అమీర్ ఖాన్ స్వయంగా తన పెళ్లి గురించి ప్రస్తావించాడు. జూలై 5న తన నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన అధికారికంగా ధృవీకరించాడు. ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో చాలా సాదాసీదాగా జరగనుందని పేర్కొన్నాడు. ఇరు కుటుంబాలు ఈ వేడుకను ప్రైవేట్‌గా ఉంచాలని భావించాయని, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న తమను అందరూ ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా కోరాడు.