అమెరికాలో కాల్పుల.. హింసకు తావు లేదు: మోదీ

వాషింగ్టన్: అమెరికాలోని వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌పై జరిగిన కాల్పుల ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. కాల్పుల ఘటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రథమ మహిళ, వైస్‌ ప్రెసిడెంట్‌కు ఎలాంటి హాని జరగలేదని తెలియడంతో తనకు ఎంతో ఊరట కలిగించిందన్నారు. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ ఘటనను సందేహం లేకుండా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికా శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్‌లో డిన్నర్ లో కోలో టామోస్ అలెన్ అనే దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. అలెన్ టీచర్ గా పని చేస్తున్నట్టు సమాచారం.